మన్నించండి.. చాలా బాధపడ్డా: బాలకృష్ణ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/15 జనవరి 2023: దేవబ్రాహ్మణులపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వివరణ ఇచ్చారు. ఎదుటివాళ్లను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ‘‘నా మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధపడ్డాను. నేను ఎదుటివాళ్లను బాధపెట్టే వ్యక్తిని కాదని మీకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలా మాట్లాడాను. నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని నా పొరపాటను మన్నిస్తారని ఆశిస్తున్నా’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.