ప్రీతి చెల్లి కీ ప్రభుత్వ ఉద్యోగం ఉత్తర్వులు జారీ
హ్యూమన్ రైట్స్ టుడే /వరంగల్ జిల్లా / మే 21:
కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. హైదరాబాద్ HMDA లో ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూజకు ఐటీ సెల్ లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో HMDA పేర్కొంది.
మెడికో ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రీతి మరణించిన తర్వాత ఆమె కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందచేసింది. అదే సమయంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి కేటీఆర్ తన శాఖ పరిధిలోని HMDA లో ప్రీతి చెల్లి పూజకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు మే 20వ తేదీ శనివారం పూజను HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.